గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 లక్షల మంది ఇళ్లు లేని పేదలు ఉన్నారని, కేసీఆర్ మాటలు చెప్పి కళ్ళలో కారం కొట్టారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. IDH కాలనీలో వంద ఇళ్లు కట్టి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో షో చేశారని విమర్శించారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం కేంద్రం హడ్కో కింద 9 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు ఈటల రాజేందర్. డబుల్ బెడ్ రూం ఇళ్లు పంచే దమ్ము కేసీఆర్ కి లేదని, ఆ రోజు మంత్రులు హరీష్ రావు, తుమ్మల, కడియం తో కలిసి ఊళ్ళలో అపార్ట్ మెంట్లు కాకుండా… వాళ్ళ వాడల్లో ఇల్లు కట్టుకునే విధంగా డబ్బులను ఇవ్వాలని కేసీఆర్ ను కోరామన్నారు.
Also Read : Cat attacks Owner: పిల్లి పులి అవ్వడం అంటే ఇదేనేమో… యజమానికి చుక్కలే!
అంతేకాకుండా.. ‘గృహలక్ష్మి పథకం కింద 3లక్షల రూపాయలు అంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ పెరిగింది.. ధరలు పెరిగాయి… ఈ రోజు ఇచ్చే మూడు లక్షల రూపాయల బిచ్చం తో ఏమి కాదు. కేవలం 3 లక్షల తో పునాదులు కూడా పూర్తి కాదు. ఆనాడు చెప్పిన విధంగా 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ టైం మూడు నెలలు మాత్రమే. గృహలక్ష్మి పథకం కింద ఇప్పుడు ప్రొసీడింగ్స్ మాత్రమే ఇస్తారు… వచ్చే మన ప్రభుత్వమే ఇస్తుంది. ఏపీలో 20 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు.. తెలంగాణలో మాత్రం లక్ష ఇళ్లు కూడా కట్టలేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తాం. 5వేలకు పైగా ఎకరాల అసైన్డ్ మెంట్ ల్యాండ్ పేదల నుంచి కేసీఆర్ లాక్కున్నారు. బండంగ్ పేట అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా చేయాలని నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నా.’ అని ఈటల వ్యాఖ్యానించారు.
Also Read : Tetanus Shot : దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ అవసరమేనా? మీ కోసమే పూర్తి వివరాలు?