దెబ్బ తగిలినా, ఏదైనా ఇనుప రేకులు, సువ్వలు గీసుకుపోయినా మొదట వినిపించే పేరు టీటీ ఇంజెక్షన్ . ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి దెబ్బ తగిలినప్పుడు ఖచ్ఛితంగా టీటీ షాట్ తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో టీటీ ఇంజెక్షన్ తీసుకున్నా నొప్పి తగ్గకపోవడం, చీము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎలాంటప్పుడు టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్‌లో ఒకటి. ఈ ఇన్ఫెక్షన్‌కు కారణం క్లస్ట్రీడియమ్ టెటానీ అనే ఒక బ్యాక్టీరియా. ఇవి మట్టిలో, దుమ్ములో ఇలా ప్రతి చోటా ఉంటాయి. అవి శరీరంలోకి చేరుకున్నప్పుడు వ్యాధికి కారణం అవుతాయి. టీటీ ఇంజెక్షన్ కేవలం టెటనస్ వ్యాధి నుంచి రక్షణను ఇస్తుంది. అది కూడా దెబ్బ తగిలిన ఒక్క రోజు లోపు దీన్ని తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. అయితే ఇక్కడ మనలో చాలా మందికి దీనికి సంబంధించి అపోహలు ఉన్నాయి.
Also Read: Viral Video: వీడు మామూలోడు కాదురా సామీ… సింహాన్నే చెప్పుతో కొట్టిన వ్యక్తి!
దీనిలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది దెబ్బ వల్ల కలిగే నొప్పిని టీటీ ఇంజెక్షన్ తగ్గించలేదు. టెటనస్ ఇన్ఫెక్షన్ కేవలం తుప్పు పట్టిన వాటి నుంచే కాదు.. ఏ గాయం వల్ల అయినా కలగవచ్చు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా ఇతర క్రిముల వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పుండు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలి. టీటీ ఇంజక్షన్ ను చాలా మంది ప్రతి ఆరునెలలకు ఒకసారి తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే పది సంవత్సరాల వరకు అది ధనుర్వాతం రాకుండా రక్షణ ఇస్తుంది.కాబట్టి దానిని తరచుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. టెటనస్ వ్యాధి రాకుండా ఉండాలంటే మాత్రం టీటీ ఇంజెక్షన్ తీసుకోవడం తప్పనిసరి.