BJP MLA Etela Rajender About Dasoju Sravan BJP Joining
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎమ్మెల్య ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని విశ్వవిద్యాలయాల్లో అదే రకమైన పరిస్థితి ఉందని ఆయన మండిపడ్డారు. గవర్నర్ దగ్గర పిల్లలు మొరపెట్టుకున్నారని, సీఎం కేసీఆర్ మనువడ్ని ఆ హాస్టల్ లోనే పేద విద్యార్థుల పక్కనే ఉంచండని, వ్యంగ్యంగా మాట్లాడటం లేదు… బాధతో చెబుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. నా ఒక్కడి ఇంటి దగ్గర 30 మంది ఇంటలిజెన్స్ సిబ్బంది ని పెట్టారు. తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యార్థుల మెనూ చార్జీలు పెంచాలని, ఇంటలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించి స్కూల్స్, హాస్టళ్ల వ్యవస్థపై రిపోర్ట్ తెప్పించుకోవలని ఈటల సూచించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీ నేతలతో పాటు పలువురు వ్యాపారవేత్తలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.
పొయ్యే కాలం వస్తే ఎవడు ఆపలేరని, కేసీఆర్ నెత్తిన శని ఉందని, హుజురాబాద్ లో చిల్లర వేషాలకు టీఆర్‌ఎస్ నేతలు అభాసుపాలు అయ్యారన్నారు ఈటల. దాసోజు శ్రవణ్ పీసీసీ చీఫ్ నిర్ణయాలు నచ్చక బయటకు వచ్చారు ఇంకా చాలా మంది నేతలు వస్తారని, సిద్దిపేటకు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్, టీఆర్‌ఎస్ నేత మురళి యాదవ్ బీజేపీ లో చేరుతున్నారన ఆయన తెలిపారు. అంతేకాకుండా.. కన్నెబొయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్ తోపాటు 10 నుంచి 20 మంది నేతలు ఈనెల 21 వ తేదీన అమిత్ షా సమక్షంలో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. జాయినింగ్స్ రొటీన్.. మాకు కామన్ అయిపోయాయని ఆయన అన్నారు.