Pat Cummins Feels ICC should allowe bigger squads in World Cups: వన్డే ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగే టోర్నీ అని, ఒక్కో జట్టుకు 15 మంది ఆటగాళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం సరికాదని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ వ్యవధిని దృష్టిలో ఉంచుకుని.. ఒక్కో జట్టు 15 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లను తీసుకునేలా అనుమతించాలని ఐసీసీని కోరాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ప్రపంచకప్ కోసం ఒక్కో జట్టు 15 మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. ప్రస్తుతం చాలా జట్లు గాయాల బారిన పడి సతమతం అవుతున్నాయి. ముఖ్యంగా న్యూజీలాండ్, ఆస్ట్రేలియా టీమ్స్. ఈ నేపథ్యంలోనే 15 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వాలని కమిన్స్ కోరుతున్నాడు.
గాయంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్, వ్యక్తిగత కారణాల కారణంగా మిచెల్ మార్ష్ స్వదేశం వెళ్లడంతో వారు జట్టుకు దూరమయ్యారు. ఈ ఇద్దరు జట్టుకు కీలకం అన్న విషయం తెలిసిందే. ‘వన్డే ప్రపంచకప్ దాదాపు రెండు నెలల పాటు సాగుతుంది. న్యూజిలాండ్ జట్టు లాంటి పరిస్థితిని ఎవరూ కోరుకోరు. కివీస్ జట్టు గాయాలతో సతమతం అవుతోంది. అయితే అదృష్టవశాత్తూ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను జట్టుతోనే ఉన్నాడు. కానీ అతడిని తప్పించాల్సి వస్తే.. అలాంటి పరిస్థితి క్రికెట్‌కు లేదా ప్రపంచకప్‌కు మంచిది కాదు. మ్యాచ్ కోసం అవసరమైన ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండాలి’ అని కమిన్స్ అన్నాడు.
Also Read: Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
‘గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ మా జట్టుకు కీలకం. సుదీర్ఘంగా సాగే ఈ టోర్నీలో ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయి. పిచ్, కూర్పు లాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే ప్రపంచకప్ టోర్నీకి 15 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకునేలా జట్లకు ఐసీసీ అనుమతి ఇవ్వాలి. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్ అందుబాటులో ఉంటాడనుకుంటున్నా. మార్ష్ కూడా తిరిగొస్తాడు. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. సెమీస్‌కు చేరువయ్యేకొద్దీ పూర్తిస్థాయి జట్టు అందుబాటులో ఉంటుంది. మా లక్ష్యం ఇప్పుడు సెమీస్‌కు చేరడం. ప్రపంచకప్ 2023లో ఇంగ్లండ్ ఆట చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.