Gold and SIlver Price Today in Hyderabad on 4th November 2023: గత కొన్నిరోజులుగా బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకీ పెరగడమే తప్ప.. తగ్గడం లేదన్నట్లు దూసుకుపోతున్నాయి. దాంతో పసిడి ధరలు 62 వేలకు చేరువైంది. శుక్రవారం పెరిగిన బంగారం ధరలు నేడు అదే బాటలో నడిచాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం (నవంబర్ 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,750గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 110 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,900గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,000లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,180గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,750గా కొనసాగుతోంది.
Also Read: The Road : త్రిష నటించిన థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్…
మరోవైపు నేడు వెండి ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 74,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 700 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,100లు ఉండగా.. చెన్నైలో రూ. 77,000గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,000లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,000గా కొనసాగుతోంది.