David Warner unique test record in Ashes 2023: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ ఇప్పటివరకు 25 సార్లు 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. యాషెస్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో దేవ్ ఈ రికార్డు సాధించాడు. నాలుగో రోజు ఆటలో మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వార్నర్, ఖవాజా ఇప్పటికే 135 పరుగులు చేశారు.
జాక్ హబ్స్, గ్రేమ్ స్మిత్, అలిస్టర్ కుక్‌ల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును డేవిడ్ వార్నర్ అధిగమించాడు. ఈ ముగ్గురు 24 సార్లు టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఈ జాబితాలో మైఖేల్ ఆథర్టన్, వీరేంద్ర సెహ్వాగ్ (23) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో వార్నర్ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
Also Read: Gold Today Price: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
యాషెస్‌లో 2017-18 తర్వాత తొలిసారి సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. ఆ సీజన్‌లో ఆసీస్ ఓపెనింగ్ పెయిర్ డేవిడ్ వార్నర్, కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ తొలి వికెట్‌కు 122 పరుగులు చేశారు. యాషెస్ 2023లో డేవిడ్ వార్నర్-ఉస్మాన్ ఖవాజా జోడీ అజేయమైన 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇక యాషెస్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో దేవ్ నాలుగో స్థానానికి చేరాడు. వార్నర్ ఇప్పటివరకు 8 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ జాబితాలో జాక్ హబ్స్ (16) టాప్‌లో ఉన్నాడు.
యాషెస్ 2923లోని ఐదవ టెస్ట్‌లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 38 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 135 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (58), ఉస్మాన్ ఖ్వాజా (69) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 249 రన్స్ చేసింది. నాలుగో రోజు వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు.
Also Read: 75 Hard Fitness Challenge: పాపం టిక్‌టాకర్.. అతిగా నీళ్లు తాగింది, ఆసుపత్రిపాలైంది