ఈ నగరానికి ఏమైంది.. విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అంతగా మెప్పించలేదు కానీ రీ రిలీజ్ టైమ్ లో మాత్రం అద్భుతమైన స్పందన రాబట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందోనని ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసారు. మొత్తానికి ఇటీవల ఈ సినిమా సీక్వెల్ ను ప్రకటించాడు తరుణ్ భాస్కర్. సినిమా ప్రేమికులకు టీమ్ కన్యారాసి మరోసారి ఎంటర్టైన్మెంట్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
అయితే ఈ సీక్వెల్ భారీ బడ్జెట్ పై నిర్మించబోతున్నారు. సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్ తో యాక్షన్-థ్రిల్లర్ గా ENERepeat ను నిర్మించనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై బజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా 50% షూటింగ్‌ను థాయ్‌లాండ్‌లో అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేయనున్నారు. మల్టీ-క్యామరా యాంగిల్స్, ఎక్స్ట్రీమ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన ల్యాండ్‌స్కేప్ ఫ్రేమ్స్ తో ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు గట్టిగా ప్లాన్ చేసాడు తరుణ్ భాస్కర్. ENERepeatను గ్లోబల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. 2026 ఎండ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ లీడ్ ర్లోల్ వస్తున్న ఈ సినిమాను సృజన్ ఏరబోలు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.