Endowment : ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అవినీతి అధికారులకు పదోన్నతులు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అవినీతి అధికారులకు పదోన్నతులు కల్పిస్తున్నారు అధికారులు. దేవదాయ శాఖలో అవినీతి తిమింగ్లాలను పట్టుకుంటున్నారు ఏసీబీ అధికారులు.. అయితే.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు పదోన్నతులు ఉన్నతాధికారులు కల్పించారు. 2017వ సంవత్సరంలో రాజమహేంద్రవరం ప్రాంతీయ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ డిసెంబర్ నెలలో ఏసీబీ అధికారులకు పట్టు పడ్డారు.. ఆయన దగ్గర నుంచి బంధువుల వద్ద నుంచి భారీ మొత్తంలో ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.. వారి బంధువులే కాకుండా వారి సోదరుడు దగ్గర కూడా సుమారు 50 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అప్పట్లో ఏసీబీ అధికారులు ద్రువీకరించారు.. ఏసీబీ అధికారుల్లో పట్టుబడిన అధికారికి ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి పదోన్నతి కల్పించకూడదు అన్న ప్రభుత్వం వారు ఇచ్చిన జీవో ఉంది, కానీ కొంత మంది ఉన్నతాధికారులు వారికి పదోన్నతులు కల్పిస్తూ ఇంకా అక్రమ ఆస్తులను కూడగట్టుకోండి అన్న ధోరణలో అవినీతి అధికారులకు పదోన్నతులు కల్పిస్తున్నారు.. ప్రస్తుతం చంద్రశేఖర్ ఆజాద్ రాష్ట్ర దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ (ఎస్టేట్) గా విధులు నిర్వహిస్తున్నారు..
అవినీతి తిమింగలంలో చంద్రశేఖర్ ఆజాద్ కు ఏ మాత్రం తగ్గేదే లేదు అంటున్నారు డిప్యూటీ కమిషనర్ విజయ రాజు.. విజయ రాజు అక్రమాస్తుల విలువ అక్షరాల 100 కోట్లు ఉన్నట్లు సమాచారం. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న యం.విజయ రాజు 2017 నవంబర్ నెలలో ఏసీబీ అధికారులకు పట్టు పడ్డారు.. విజయరాజు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లతో కోట్లాది రూపాయలు అక్రమ ఆస్తులు భారీ బంగారం, వెండి మరియు విలువైన ఆస్తులు, భారీగా చీరలు ఉన్నట్లుగా ఏసిబి అధికారులు గుర్తించారు.. వాటి విలువ సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అప్పట్లో ఏసీబీ అధికారులు ద్రువీకరించారు.. అసిస్టెంట్ కమిషనర్ హోదా నుంచి 2020వ సంవత్సరంలోనే విజయరాజుకు అమాంతం డిప్యూటీ కమిషనర్ హోదా కల్పించారు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఇందులో మతలబు ఏమిటి అన్నది 1000 డాలర్ల ప్రశ్న.. ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు అందలం ఎక్కిస్తూ పదోన్నతులు కల్పిస్తూ ఉన్నత అధికారులు కూడా అక్రమ సంపాదనలో భాగస్వాములు అవుతున్నారా అన్నది పలు అనుమానాలకు తావిస్తోంది.. ఏదేమైనా దేవదాయ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల పైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని,దేవాదాయ శాఖలో అవినీతి తిమింగలాలను బట్టబయలు చేసి వారికి దేవాదాయ శాఖలోనే కాకుండా ఏ ఇతర ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహించే అర్హత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు..
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!