Abhijeet Dipke: “ఇది అంతం కాదు.. ఆరంభం”.. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు, ఉద్యమ నాయకుడు 29 ఏళ్ల అభిజీత్ దిప్కే చారిత్రాత్మక విజయం సాధించాడు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వం మిగతా డిమాండ్లకు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలతో దిప్కేకు ఎట్టకేలకు విశ్రాంతి లభించింది. ఈ రోజు ఉదయం సోసల్ మీడియాలో అభిజీత్ దీప్కే ఓ వీడియో విడుదల చేశాడు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా దూరం ప్రయాణించాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి.
రేపు ఉదయానికల్లా ఏం జరుగుతుందో, తదుపరి ఏం చేయాలో అనే ఆందోళనలు ఏమీ లేకుండా నా ఇంట్లోనే ప్రశాంతంగా నిద్రలేచే అవకాశం దక్కిందంటూ దిప్కే వీడియోలో పేర్కొన్నారు. గడిచిన 37 రోజుల సుదీర్ఘ నిరసన కాలం చాలా చాలా కష్టంగా సాగిందని పేర్కొంటూ, తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తన సోషల్ మీడియా ఫాలోవర్లకు గుర్తుచేశారు.
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
తాజాగా సిద్ధించిన విజయం అంత సులువుగా ఏమీ రాలేదని దిప్కే గుర్తుచేసుకున్నారు. అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నప్పటికీ CJPకి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నందున నిన్న జంతర్ మంతర్ వద్ద అందరినీ కలిసి వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పలేకపోయానని క్షమాపణలు కోరారు. “37 రోజులుగా జంతర్ మంతర్ వద్ద వేచి ఉన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరు దేశం కోసం చేసిన దాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా తమను విమర్శించిన వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, వారి చట్టబద్ధమైన ప్రశ్నలే తమ లోపాలను దిద్దుకుని ముందుకు సాగడానికి, విజయం సాధించడానికి తోడ్పడ్డాయని స్పష్టం చేశారు.
CJP Founder @abhijeet_dipke releases a video thanking everyone who made the huge victory of the youth possible.
He also thanks all critics for helping him improve, and eventually deliver on the promise of the Cockroach Janta Party’s first campaign. #ANewDay pic.twitter.com/1JQNozymLo
— Cockroach is Back (@Cockroachisback) July 26, 2026
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!