Empty Stands In PAK vs IND Asia Cup 2023 Matach in Colombo: సాధారణంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా అభిమానులతో స్టేడియం నిండిపోతుంది. ఇక మేజర్ టోర్నీలు అయితే స్టేడియంలో ఒక్క సీట్ కూడా ఖాళీగా కనిపించదు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయాక.. ఇండో-పాక్ పోరుకు డిమాండ్ మరింత పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. అయితే ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగున్న ఆసియా కప్ 2023లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
ఆసియా కప్ 2023 లీగ్ దశలో జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు పెద్దగా అభిమానులు రాలేదు. అక్కడక్కడా స్టాండ్స్ ఖాళీగా కనిపించాయి. ఆదివారం (సెప్టెంబర్ 10) సూపర్-4 మ్యాచ్‌లోనూ అదే దృశ్యం పునరావృతమైంది. ఇండో-పాక్ మ్యాచ్‌కూ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం నిండలేదు. స్టాండ్స్ ఖాళీగా ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లకూ వర్షం ముప్పు ఉండడంతో అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదని అధికారులు భావిస్తున్నారు.
Also Read: US Open 2023: యుఎస్ ఛాంపియన్‌గా జకోవిచ్.. మార్గరెట్ కోర్ట్ రికార్డు సమం!
ఇక ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను వరుణుడు వదలలేదు. ఆసియా కప్ 2023లో ఇప్పటికే ఇండో-పాక్ మధ్య లీగ్ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు.. ఆదివారం సూపర్-4 మ్యాచ్‌కూ అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 24.1 ఓవర్లలో 147/2తో ఉన్న దశలో భారీ వర్షం పడింది. ఆట మళ్లీ పునఃప్రారంభం కాలేదు. వర్షం తగ్గినా మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో.. రిజర్వ్ డే అయిన సోమవారానికి మ్యాచ్‌ను వాయిదా వేశారు. నేడు ఆగిన చోటి నుంచే మ్యాచ్ కొనసాగనుంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (58; 52 బంతుల్లో 10×4), రోహిత్ శర్మ (56; 49 బంతుల్లో 6×4, 4×6) హాఫ్ సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లీ (8), కేఎల్ రాహుల్ (17) క్రీజులో ఉన్నారు.
Even in this last India vs Pakistan game, Rohit Sharma did the same and then Rain happened. #INDvsPAK pic.twitter.com/OFVuiWW7Mm
— R A T N I S H (@LoyalSachinFan) September 10, 2023