US Open 2023: యుఎస్ ఛాంపియన్‌గా జకోవిచ్.. మార్గరెట్ కోర్ట్ రికార్డు సమం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Novak Djokovic wins 24th Grand Slam by beating Daniil Medvedev in US Open 2023: సెర్బియన్ స్టార్, టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన జకోవిచ్.. టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (24) రికార్డును సమం చేశాడు. యుఎస్ ఓపెన్ 2023 టైటిల్ గెలిచిన జకో.. ఈ అరుదైన రికార్డును సాధించాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదెవ్‌ను 6-3, 7-6(7-5), 6-3 తేడాతో చిత్తు చేశాడు.
ఆదివారం జరిగిన యుఎస్ ఓపెన్ 2023 ఫైనల్ ఫోరు హోరాహోరీగా సాగుతుందని భావించినప్పటికీ.. నోవాక్ జకోవిచ్ జోరు ముందు మెద్వెదెవ్ నిలబడలేకపోయాడు. తొలి సెట్‌లో 6-3 తేడాతో మెద్వెదెవ్‌ను చిత్తు చేసిన జకోకు రెండో సెట్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఓ సమయంలో రెండో సెట్‌ను మెద్వెదెవ్ గెలిచేలా కనిపించినా.. జకో అనూహ్యంగా పుంజుకుని 7-6 తేడాతో కైవసం చేసుకున్నాడు. కీలక మూడో సెట్‌లో మెద్వెదెవ్ తేలిపోవడంతో జకోవిచ్ 6-3 తేడాతో గెలిచి టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ మూడు గంటల 17 నిమిషాల పాటు సాగింది.
Also Read
Also Read: Rajasthan: సామూహిక అత్యాచారం నగ్నంగా పరుగులు తీసిన మహిళ
యూఎస్ ఓపెన్ 2021 ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకున్న మెద్వెదెవ్.. ఈ సారి మాత్రం బోల్తా పడ్డాడు. ఈ విజయంతో జకోవిచ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక ఈ ఏడాది జకోవిచ్ జోరు కొనసాగుతోంది. నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు వెళ్లిన జకో.. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌లో విజయం సాధించాడు. వింబుల్డన్‌లో మాత్రం యువ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓడిపోయాడు.
24 and counting for Novak Djokovic! pic.twitter.com/JHBdaR98Qs
— US Open Tennis (@usopen) September 10, 2023
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!