అసలే ఏనుగు… భారీకాయం.. అందులోనూ బావిలో పడితే ఎలా వుంటుంది? ఊహించుకోవడానికే కష్టంగా వుంది కదూ. కానీ ఇది నిజంగా జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి పంచాయతీ గాండ్ల పల్లె గ్రామంలోని రైతు జగ్గయ్య నాయుడు బావిలో సోమవారం రాత్రి ఏనుగు పడిపోయింది. నీటిలో ఈదుతున్న ఏనుగును వెలికి తీసేందుకు అటవీ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేశారు. అయితే చాలాసేపటివరకూ ఫలించలేదు.
బావిలోంచి వస్తున్న గజరాజు ఘీంకారాలు విన్న రైతులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. ఏనుగును బయటకు తీయటానికి వెళ్లిన అటవీశాఖ సిబ్బందిని అడ్డుకున్నారు రైతులు. నిత్యం గజరాజుల దాడులతో పంట పొలాలు నష్టపోతున్న పట్టించుకునే నాథుడే లేడని, ఇప్పుడు బావిలో పడ్డ ఏనుగుని బయటకు తీయడానికి వచ్చారా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది.
Read ALso: Himanshu Rao: బాలకృష్ణ డైలాగ్ వైరల్.. ట్విట్ చేసిన కేసీఆర్ మనువడు..
బావిలో పడ్డ ఏనుగును బయటకు తియ్యడానికి ప్రయత్నించిన అధికారులకు గ్రామస్థులకు మధ్య వివాదం ఏర్పడింది. అధికారులు బావిలోంచి గజరాజుని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే గ్రామస్తులు బావిని JCB తో పూర్తిగా నాశనం చేస్తారని,అలా కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే మార్గంలో బయటకు లాగాలని వారించగా అధికారులు బావి యజమానికి సర్దిచెప్పి మళ్ళీ బావిని బాగుచేయిస్తామని హామీ ఇచ్చి ఏనుగును బయటకు లాగారు… దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Four tigers in Maharashtra: చంద్రాపూర్ జిల్లాలో నడిరోడ్డు పై గాండ్రిస్తున్న పులి..