పాలకుర్తిలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అందరి నోట్లో నాలుకల ఉన్న దయన్న గెలవాలా… నోట్ల కట్టలతో వచ్చిన ఎన్ఆర్ఐ గెలవాలా అని ప్రశ్నించారు. ఇంటింటికి దయన్న మంచి నీళ్లు ఇచ్చారని తెలిపారు. నోట్ల కట్టలకి అమ్ముడు పోయే గడ్డ కాదు ఈ పాలకుర్తి గడ్డ అని అన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్న కాంగ్రెస్ ది ఉన్న గోషి ఉషిపోయిందని విమర్శించారు. కర్ణాటక ఎలక్షన్ లో మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ పత్తా లేదు, రాహుల్ గాంధీ జాడ లేడని దుయ్యబట్టారు.
Aditya L1: చివరి దశలో ఆదిత్య ఎల్1.. జనవరి 7న చివరి విన్యాసాలు..
కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా అని మంత్రి అక్కడి జనాలను ఉద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే 3 గంటల కరెంటు ఇస్తా అంటున్నారని తెలిపారు. కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. రైతులని బిచ్చగాళ్లనీ అవమానపరిచిన వ్యక్తి రేవంత్ రెడ్డని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు కుట్రలు చేస్తున్నారని.. రైతుబందు నకలు కొట్టిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని హరీష్ రావు ఫైర్ అయ్యారు. 12 సార్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ కావాలా…12 మంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ కావాలా అని విమర్శలు చేశారు.
Tillu Square: రాధిక ..రాధిక.. రాధిక అంటూ జపం చేస్తున్న టిల్లుగాడు
రిస్క్ వద్దు… కారుకి గుద్దు అని మంత్రి హరీష్ రావు అన్నారు. అప్పట్లో టింగ్ టింగ్ నా బోరింగు ఎంత కొట్టిన రాదయే…ఇపుడు మిషన్ భగీరథ ఇచ్చిన ఘనత కేసీఆర్ అని తెలిపారు. గిరిజన కులాల వారికి శుభవార్త చెప్తున్నా.. దయన్నని గెలిపిస్తే గిరిజన బంధు ఇప్పిస్తా అని చెప్పారు. నేను వద్దన్నా నా చేయి పట్టి సంతకం పెట్టించుకుని మీ దయన్న ఎన్ని పైసలు కావాలో అన్ని తీసుకొస్తాడని అన్నారు. కాంగ్రెస్ వాళ్లది చెల్లని రూపాయి అని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తది.. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళని నమ్మొద్దని మంత్రి పేర్కొన్నారు.