టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కోటబొమ్మాళి పీఎస్.. ఈ చిత్రంలో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించారు. రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, శివానీ రాజశేఖర్, మురళీ శర్మ, విష్ణు ఓయ్ మరియు దయానంద్ రెడ్డి ఈ మూవీ లో కీలక పాత్రలు చేశారు. నటీనటుల పర్ఫార్మెన్స్, కథ, కథనాల విషయంలో కోట బొమ్మాళి పీఎస్ ఆకట్టుకునేలా ఉందనే టాక్ వినిపిస్తుంది.. ఈ చిత్రానికి తేజ మర్ని దర్శకత్వం వహించారు.కోట బొమ్మాళి పీఎస్ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్ మరియు విద్య కొప్పినీడి నిర్మించారు. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా జగదీశ్ చీకటి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 24) థియేటర్లలో రిలీజ్ అయింది..కోట బొమ్మాళి పీఎస్ సినిమాకు తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. మంచి ఓపెనింగ్స్ అందుకుంది.
కోట బొమ్మాళి పీఎస్ మూవీ విడుదలకు ముందు ట్రైలర్, పాటలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.ఈ మూవీ రిలీజ్ తొలి రోజు తొలి షోకు కాస్త నెమ్మదిగానే కలెక్షన్లు వచ్చాయి. అయితే, పాజిటివ్ టాక్ రావడంతో తర్వాతి షోలకు ఆదరణ పెరిగింది. దీంతో వసూళ్లు కూడా పెరిగాయని తెలుస్తోంది. మొత్తంగా కోట బొమ్మాళి పీఎస్ చిత్రానికి తొలి రోజు రూ.1.75కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. తక్కువ బడ్జెట్‍తోనే రూపొందిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.మంచి టాక్ రావటంతో కోట బొమ్మాళి పీఎస్ సినిమా కలెక్షన్లు రెండో రోజు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆదికేశవ చిత్రానికి మిశ్రమ స్పందన రావడంతో ఈ సినిమాకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది.రాజకీయ నాయకులు.. పోలీసు వ్యవస్థని ఎలా వాడుకుంటారన్న కథాంశంతో కోట బొమ్మాళి పీఎస్ మూవీ తెరకెక్కింది. పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అలాగే ఓటర్ల ఆలోచనలను ఈ చిత్రంలో దర్శకుడు చక్కగా చూపించారు.