పాలకుర్తిలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అందరి నోట్లో నాలుకల ఉన్న దయన్న గెలవాలా... నోట్ల కట్టలతో వచ్చిన ఎన్ఆర్ఐ గెలవాలా అని ప్రశ్నించారు. ఇంటింటికి దయన్న మంచి నీళ్లు ఇచ్చారని తెలిపారు. నోట్ల కట్టలకి అమ్ముడు పోయే గడ్డ కాదు ఈ పాలకుర్తి గడ్డ అని అన్నారు.