Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి
- అదుపుతప్పి కాలువలో పడ్డ కారు
- ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి
- మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు
- జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రహదారిపై వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. కారులో ఉన్నవాళ్లంతా కిష్త్వార్ నుంచి వస్తున్నారు.
READ MORE: IPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో భారత్‌లోనే తయారీ.. యాపిల్ నిర్ణయంతో చైనాకు టెన్షన్!
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము రీజియన్‌లోని కిష్త్వార్ నుంచి వస్తున్న JK03H9017 నంబర్ గల సుమో వాహనం దక్సమ్ సమీపంలో అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు (పోలీస్) మృతి చెందారు. మృతుల్లో భార్యభర్తలు ఉండగా.. వారి పేర్లు ఇంతియాజ్, అఫ్రోజాగా గుర్తించారు. ఈ ప్రమాదానికి గురైన ఇంతియాజ్ వృత్తిరీత్యా పోలీసు. పోలీసు అధికారి ఇంతియాజ్ అహ్మద్ తన ఐదుగురు పిల్లలు, భార్య, మరో మహిళతో కలిసి కారులో కిష్త్వార్ నుంచి మద్వా కిష్త్వార్‌లోని తన ఇంటికి వస్తు్న్నారు. కిష్త్వార్-అనంతనాగ్ రహదారిలోని అరషన్ ప్రదేశంలో ప్రమాదానికి గురయ్యారు. వాహనం కాలువలో పడిపోయింది. ప్రమాదం అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటని పోలీసులు తెలుసుకుంటున్నారు. ప్రమాదం తర్వాత కారు పూర్తిగా ధ్వంసమైంది.
READ MORE:IPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో భారత్‌లోనే తయారీ.. యాపిల్ నిర్ణయంతో చైనాకు టెన్షన్!
గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ..
సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని జోజిలా పాస్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు పర్యాటకులు ప్రయాణిస్తున్న కారు లోతైన లోయలో పడింది. ఇద్దరు మరణించగా..ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!