జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చోసిటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 160 మంది గాయపడ్డారు. 220 మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు. మృతుల్లో ఇద్దరు CISF జవాన్లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అమిత్ షాకు పరిస్థితి గురించి తెలియజేశారు. శిథిలాల కింద లేదా ప్రమాదంలో చిక్కుకున్న ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి సహాయ సిబ్బంది గంటల తరబడి కష్టపడి పనిచేస్తున్నారు. సహాయ…
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఇప్పటికే, ఈ ఒప్పందాన్ని నిలిపేయడంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. అయితే, భారత్ వీటిన్నింటిని పట్టించుకోకుండా సింధు, దాని ఉపనదుల నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రహదారిపై వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు.
Jammu and Kashmir Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల వాహనం లోయలో పడి ఎనమిది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని బుజ్తలా బొనియార్ ప్రాంతం వద్ద ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. Also Read: Budget 2024 : యువతకు ఉపాధి, పేదల సామాజిక సంక్షేమం,…
Chopper Crash: జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కిష్త్వార్ జిల్లాలోని మార్వా తహసీల్‌లోని మచ్చ్నా గ్రామ సమీపంలో గురువారం ఆర్మీ ఛాపర్ కూలిపోయింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నారు. పైలట్, కో పైలట్ గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. హిల్ మార్వా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ అధికారుల తెలియజేసిన వివరాలు ప్రకారం హెలికాప్టర్ లో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారు.
Earthquake: జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్‌వార్‌లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్‌వార్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.