ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా జరుగుతోంది. సభా ప్రాంగణమంతా గులాబీమయమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు మీటింగ్ కు తరలివచ్చారు. కళాకారుల ఆటపాటలతో సబా వేదిక దద్దరిల్లింది. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ స్టెప్పులతో అలరించారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్ జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతుల కోసం కేసీఆర్ నివాళులర్పించారు.
Also Read:Sree Charani: పల్లెటూరు టు ఇంటర్నేషనల్.. టీమిండియాలోకి మరో కొత్త తెలుగమ్మాయి అరంగేట్రం..!
పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పాక్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ దౌత్య దాడి చేపట్టింది. సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అట్టారి, వాఘా బోర్డర్ ను మూసివేయనున్నట్లు ప్రకటించింది. పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసింది. దేశంలో ఉన్న పాకిస్థానీయులు తమ దేశం వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది.