ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి రోజు వ్యాయామం, పోషకాహారం తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఏది పడితే అది ఎంత పడితే అంత కాకుండా పద్దతిగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఊదలు, అండు కొర్ర, అరికెలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. చిరుధాన్యాలు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషకాలను కలిగి ఉంటాయి. చిరుధాన్యాలను తినడం…
ఆహార మార్పుల వల్లనో, వాతావరణం వల్లనో చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం పాలవుతున్నారు. దాంతో పాటు ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వీటన్నిటినీ అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార పద్ధతులను పాటించాలంటున్నారు నిపుణులు.
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అతి చిన్న వయస్సులోనే చాలా మందికి చర్మం పై ముడతలు రావడం మనం చూస్తూనే ఉంటాం.. అందుకు కారణం శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందక పోవడం.. వాతావరణంలో మార్పులు.. ఆహారంలో మార్పులు.. అయితే పిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే కొన్ని హెల్త్ డ్రింక్స్ ను తప్పకుండ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఆ డ్రింక్ ఏంటో ఒకసారి చూసేద్దాం.. మన శరీరానికి ఆరోగ్య కరమైన పోషకాలను అందించే వాటిలో…
బరువు తగ్గడం అనేది ఈరోజుల్లో పెద్ద టాస్క్ అయ్యింది.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధికబరువును కలిగి ఉంటారు.. అధిక బరువు కారణంగా గుండె జబ్బులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువేనని నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గాలని అనుకొనేవారు తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం.. ఎటువంటి వాటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. బరువు తగ్గాలని…
GST: భారతదేశం 2023ని మిల్లెట్ల సంవత్సరంగా జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముతక ధాన్యాలను ప్రోత్సహించేందుకు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అపెక్స్ బాడీ ముతక ధాన్యాలకు సంబంధించిన కొన్ని ఉత్పత్తులపై పన్నును తగ్గించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు కలిగినవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. వచ్చే నెల నుంచి రాగులను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.. రాయలసీమలోని కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రేషన్‌కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చక్కరతో పాటు వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ఉచిత బియ్యానికి బదులు ఒక్కొక్క కార్డుపై గరిష్ఠంగా 3 కేజీల వరకు రాగులను ఉచితంగానే అందజేస్తామని సోమవారం ఓ…
భారతదేశాన్ని 'శ్రీ అన్న' (మిల్లెట్స్) సాగు, పరిశోధనలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న తరుణంలో, 27 ఏళ్ల బైగా గిరిజన మహిళ లహరీ బాయి నిజమైన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉద్భవించింది.
మారుతున్న జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఎల్‌డీఎల్ మన శరీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువగా ఉండడం అసలు మంచిదికాదు. ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోకపోతే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు…