Earthquakes on Moon: భూమి పొరల్లో కదలికల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. భూమి కంపించడం, భారీ భూకంపాలు రావడం మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా మొరాకోలో సంభవించిన భారీ భూకంపంలో రెండు వేలకు పైగా చనిపోయిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా అక్కడక్కడ ఇటీవల భూమి కంపిస్తోంది. అయితే భూమి తరువాత నివాసయోగ్యమైన ప్రదేశం లిస్ట్ లో శాస్త్రవేత్తల బ్రెయిన్ లో మొదట ఉన్నది చంద్రుడు మాత్రమే. అందుకే చంద్రుడిపై రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. తాజాగా చంద్రుడి మీది పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రయోగించిన చంద్రయాన్ 3 కూడా విజయవంతమయ్యింది. దీనికి ద్వారా జాబిల్లికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుంటున్నారు. అయితే మీకు ఎప్పుడైనా కేవలం భూమి మీదేనా లేక చంద్రుడి మీద కూడా భూకంపాలు సంభవిస్తాయా అనే అనుమానం వచ్చిందా? వస్తే దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Helmet: హెల్మెట్ పెట్టుకుంటే బట్టతల వస్తుందా? తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
భూమి మీదే కాదు చంద్రుడి మీద కూడా భూకంపాలు వస్తాయి. చంద్రుడి మీద నాలుగు రకాలైన భూకంపాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లోతైన భూకంపం, తేలికపాటి భూకంపం, నిస్సార భూకంపం, థర్మల్ భూకంపం అని నాలుగు రకాల భూకంపాలు జాబిల్లిపై సంభవిస్తాయి. లోతైన భూకంపం భూమి ఉపరితలం నుంచి 700 కిలోమీటర్ల ఎత్తువరకు సంభవిస్తుంది. తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 పాయింట్లుగా ఉంటుంది. వీటి తీవ్రత భూమిపై వచ్చే వాటి కంటే సుమారు 20 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే చంద్రుని పై భూకంపల గురించి తెలుసుకోవడానికి అమెరికా చేపట్టిన అపోలో 17 ప్రాజెక్టులో అక్కడికి వెళ్లిన వ్యోమగాములు కొన్ని భూకంపాన్ని కొలిచే పరికరాలు సిస్మోమీటర్లను అక్కడ పెట్టి వచ్చారు. అయితే చంద్రునిపై కేవలం ఐదేళ్ల కాలంలోనే 12 వేలకు పైగా భూకంపాలు, భూ ప్రకంపనలు వచ్చినట్టు వీటి ద్వారా గుర్తించారు. ఇవి కేవలం ఐదేళ్లు మాత్రమే పనిచేస్తాయి. అందుకే ఐదేళ్ల వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. అంతేకాదు తాజాగా చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ కూడా అక్కడ భూ ప్రకంపనలకు సంబంధించిన సంకేతాలను గుర్తించింది. అయతే చంద్రున్ని ఉల్కలు ఢీకొట్టడం, ఉపరితలం మీద ఉష్ణోగ్రతల మార్పు కారణంగా భూకంపాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.