Helmet Wearing: ద్విచక్ర వాహనాలు ఉపయోగించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. అది మనల్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, బండి స్కిడ్ అయ్యి పడిపోయినా తలకు గాయం కాకుండా అడ్డుకుంటుంది. అయితే హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటాయి. అందుకే హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఏదో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారని భయపడి మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటారు. అయితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోతుంది అన్నది వాస్తవం కాదు అంటున్నారు నిపుణులు. అది కేవలం అపోహ మాత్రమేనంటూ కొట్టిపడేస్తున్నారు.
Also Read: Agra: కొత్త కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అత్త.. ఆ ఒక్కటి తప్పా ఏదైనా చేస్తా అంటున్న కోడలు
హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కేవలం ప్రాణాలకు రక్షణ మాత్రమే కాకుండా జుట్టుకు కూడా రక్షణ ఇస్తుంది అంటున్నారు. దుమ్ము ధూళి జుట్టుకు తగిలి దానిని పొడిబారనీయకుండా చేస్తుంది హెల్మెట్. అయితే హెల్మెట్ విషయంలో కూడా మనం ఎలాంటి హెల్మెట్ వాడుతున్నాం అనేది కూడా ముఖ్యం. చౌకబారు హెల్మెట్ లు వాడితే జుట్టుకు చెమటపట్టి తడిగా అయిపోతుంది. అతే మంచి హెల్మెట్లు వాడితే జుట్టుకు చెమటపట్టే సమస్య కూడా ఉండదు. ఇది మాత్రమే కాకుండా హెల్మెట్ వాడగానే దానిని ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు. దానిని గాలి తగిలే చోటే పెట్టాలి. అంతేకాకుండా దాని ద్వారా ఎలాంటి బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లు లాంటివి రాకుండా ఉండాలంటే రెండు మూడు రోజులకు ఒకసారైనా ఎండలో ఉంచాలి. చుండ్రు బ్యాక్టీరియా ఫంగస్ వంటి ఇతర ఇబ్బందులు ఉన్నవారు హెల్మెట్ ను డైరెక్ట్ గా ఉపయోగించకుండా తలపైన ఒక క్లాత్ వేసుకొని దానిపైన హెల్మెట్ పెట్టుకుంటే మంచిది. దాని కారణంగా ఎక్కువ వ్యాపించకుండా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే హెల్మె్ట్ కు బట్టతలకు సంబంధం లేదు. జాగ్రత్తగా ఉపయోగిస్తే హెల్మె్ట్ వల్ల ప్రాణాలకు ఉపయోగమే తప్ప ఎలాంటి నష్టం లేదు. కచ్ఛితంగా ఖరీదైన మంచి హెల్మెట్ మాత్రమే ధరించాలి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.