Duddilla Sridhar Babu : ధాన్య సేకరణ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్య, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశ్యమని, ధాన్య సేకరణ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ తరుగు లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా త్వరగా కొనుగోలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. విద్య పై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
అంతేకాకుండా..’విద్యా వ్యవస్థలో మా మార్క్ చూపిస్తాం. రాబోయే కాలంలో గొప్ప మానవ వనరులు సృష్టిస్తాము. అమ్మ పాఠశాల కమిటీ, మౌలిక సదుపాయాల కోసం 600 కోట్లు విడుదల చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వం పాఠశాలలు గొప్పగా ఉండాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జూన్ 12 లోపు పాఠశాలల మౌలిక సదుపాయాలు, వసతులు కల్పిస్తాము. 2019లోనే మెడిగడ్డ బ్యారేజ్ వైఫల్యాలు మొదలైనాయని ndsa మధ్యంతర నివేదిక ఇచ్చింది. నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని.. లేదంటే బ్యారేజ్ పూర్తి స్థాయిలో ప్రమాదం జరుగుతుంది. ఏ ప్రత్యామ్నాయ మార్గాలను చూసినా బ్యారేజ్ నిలుస్తుందని మేము నమ్మకం ఇవ్వలేమని ndsa నివేదిక లో ఉంది. జియో ఫిజికల్, జియో టెక్నీకల్ రిపోర్టులు వచ్చిన వెంటనే వేగవంతం పనులు చేస్తాం. రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం. సాంకేతిక నిపుణులు ఏది చెబితే అది చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రజా ధనం దుర్వినియోగం కావొద్దని మా ప్రభుత్వ ఉద్దేశ్యం.’ అని శ్రీధర్ బాబు తెలిపారు.
Also Read
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
తాజావార్తలు
-
Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
-
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్‌పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్‌లో డీజే బూత్‌నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!