సంస్కృతి, సాంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు. భారతీయులంటేనే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అలాంటిది ఈ మధ్య పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఇండియా పరువు మంటగల్పుతున్నారు కొందరు. ఇందుకు యూపీలోని లక్నోలో జరిగిన ఘటనే ఉదాహరణ.
లక్నోలోని ఫీనిక్స్ పలాసియో మాల్‌లోని క్లబ్ వెలుపల మద్యం మత్తులో కొంతమంది అమ్మాయిలు గొడవకు దిగారు. ఒకరికొకరు కొట్టుకున్నారు. కొంత మంది అబ్బాయిలు విడదీస్తు్న్న వెనక్కి తగ్గలేదు. కొంతసేపు కొట్టుకుంటునే ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్లబ్ వెలుపల మద్యం మత్తులో ఉన్న అమ్మాయిలు కొట్టుకోవడం, దూషించుకోవడం వీడియోలో కనిపించింది. అర్థరాత్రి సమయంలో క్లబ్ వెలుపల గందరగోళం సృష్టించడం కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని పలాసియో మాల్‌లో అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
పార్టీలో ఉండగానే అమ్మాయిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారు భవనంలోని లాబీకి చేరుకుని ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. డ్రెస్‌లో ఉన్న అమ్మాయి లాబీలో ఉన్న మరో అమ్మాయిపై దాడి చేసింది. అక్కడే ఉన్న ఇతర యువకులు ఒకరినొకరు వేరు చేసి గొడవ ఆపడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపించింది.
ఇదిలా ఉంటే అమ్మాయిలు కొట్టుకుంటుంటే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. వారిని విడదీసేందుకు కూడా ప్రయత్నించలేదు. చాలా సేపు పోట్లాడుకుంటున్న ఎటువంటి చర్య తీసుకోకుండా నిశ్శబ్దంగా నిలబడి పోయారు. ఈ వీడియో 2 నిమిషాలకు పైగా ఉంది. అయితే ఈ గొడవకు కారణం ఇంకా తెలియలేదు. అలాగే ఎలాంటి కేసు నమోదు కాలేదు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు మండిపడుతున్నారు.
सावधान : ईयरफोन लगा लें।
.
लखनऊ की समिट बिल्डिंग की अपार सफलता के बाद पलासियो मॉल भी मैदान में। न जाने किस घर की बेटियां हैं, कोई माता पिता तो ऐसा सिखाते नही होंगे। #AmaJaneDo ☺@Uppolice please check. pic.twitter.com/zI7hfM8lPm— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) February 15, 2024