అలసత్వంతో రోడ్డు దాటుతున్న సందర్భాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను చాలానే చూసి ఉంటాం మనం. క్షణ కాలంలోనే చేసే చిన్న తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రోడ్డు మీద మనం నెమ్మదిగా ఎదురుగా వచ్చే వాహనాల నుంచి కలిగే ప్రమాదాలు కూడా ఇప్పుడు డేంజర్ గా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. అయితే తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా డ్రైవింగ్ చేసి చిన్నారి ప్రాణాలను రక్షించాడు. స్కూల్ అయిపోయిన వెంటనే ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వస్తుండగా.. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ కొడుకు సడెన్ గా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.
https://twitter.com/cctvidiots/status/1645792100200620037
Read Also : Shahid Kapoor: సల్మాన్ డైరెక్టర్ తో షాహిద్ సినిమా… త్వరలో టీజర్
అయితే సదరు బాలుడు రోడ్డు దాటుతుండగా అదే సమయంలో ఒక్కసారిగా వేగంగా వస్తున్న కారు.. అతడికి ఢీ కొట్టేది. వెంటనే తేరుకున్న డ్రైవర్ ఎంతో చాకచక్యంగా బాలుడిని అడ్డుతప్పించాడు. కారు స్టీరింగ్ ఒక్కసారిగా తిప్పడంతో కారు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటర అరంతకం.. తేరుకున్న తల్లి బాలుడిపై కోపంతో ఒక్కటిచ్చింది. ఇక.. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. వీడియోపై నెటిజన్స్ స్పందిస్తూ.. డ్రైవర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నీ వల్లే ఓ ప్రాణం నిలబడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియలేదు.
Read Also : Mother Gave Birth To 44 Children: ఇదో అనారోగ్య సమస్య..! ఆమె వయస్సు 40 ఏళ్లు.. సంతానం 44 మంది