భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటినా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో మన్మోహన్‌కు చికిత్స అందిస్తున్నారు. వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం 92 ఏళ్ల వృద్ధుడు. వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. 2021లో రెండుసార్లు ఎయిమ్స్‌లో చేరారు. ఏప్రిల్‌లో ఒకసారి, కరోనావైరస్ పాజిటివ్‌గా తేలినప్పుడు అక్టోబర్‌లో మరొకసారి ఆస్పత్రిలో చేరారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: ఏం సాధించిందని అభినందనలు చెప్తున్నావ్.. రాహుల్ గాంధీపై సెటైర్లు
మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. 33 సంవత్సరాల తర్వాత ఎగువ సభలో తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు. పీవీ.నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో జూన్ 1991లో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం నుంచి ఎగువ సభలో ఐదు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. 2019లో రాజస్థాన్‌కు మారారు. పార్లమెంటులో పెద్ద నోట్ల రద్దును మన్మోహన్ సింగ్ వ్యతిరేకించారు. దీన్ని ‘‘వ్యవస్థీకృత దోపిడీ మరియు చట్టబద్ధమైన దోపిడీ’’గా మన్మోహన్ అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Congress: రేపటి నుంచి కాంగ్రెస్ ‘‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’’ ప్రచారం..