PM Modi: తన పేరు మీద ఇల్లు లేదు కానీ.. తమ ప్రభుత్వం దేశంలో లక్షలాది మంది ఆడపిల్లలను ఇంటి యజమానులను చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్నారు. ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. చోటాఉదయ్‌పూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గిరిజనులు అధికంగా ఉండే బోడేలి పట్టణంలో విద్యా రంగానికి సంబంధించిన రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులతో సహా రూ.5,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
Also Read: Lentil imports: కెనడా నుంచి ఇండియాకి తగ్గిన పప్పు ధాన్యాల దిగుమతులు..
పేదప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని, ఆ సమస్యలను పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజల కోసం నాలుగు కోట్ల ఇళ్లను నిర్మించినందుకు తాను సంతృప్తి చెందానన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా. పేదలకు ఇళ్లు అనేది కేవలం నంబర్ మాత్రమే కాదు.. పేదలకు ఇళ్లు కట్టించడం ద్వారా వారికి గౌరవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘‘పేదల అవసరాల మేరకు ఇళ్లు కట్టిస్తున్నాం, అది కూడా మధ్య దళారుల బెడద లేకుండా.. లక్షలాది ఇళ్లు కట్టించి మా మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాం.. నా పేరు మీద ఇల్లు లేకపోయినా తన ప్రభుత్వం లక్షల మంది కూతుళ్లను ఇంటి యజమానులను చేసింది.” అని అన్నారు.
Also Read: UNFPA: రాబోయే దశాబ్దాల్లో యువభారతం వృద్ధాప్య సమాజంగా మారుతుంది..
గాంధీనగర్‌లోని ‘విద్యా సమీక్షా కేంద్రం’ అని పిలువబడే గుజరాత్ విద్యా శాఖ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ఎంతగానో ఆకట్టుకున్నారని, దేశవ్యాప్తంగా అలాంటి కేంద్రాలను ప్రారంభించాలని ఆయన కోరారు. మూడు దశాబ్దాలుగా సందిగ్ధంలో ఉన్న కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)ని ఎట్టకేలకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రధాని చెప్పారు. ఎటువంటి పేర్లు ప్రస్తావించకుండా, ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై కూడా “వారు రిజర్వేషన్ రాజకీయాలలో మునిగిపోయారు” అని విరుచుకుపడ్డారు. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు గుజరాత్‌లోని గిరిజన ప్రాంతాల్లో సైన్స్ పాఠశాలలేవీ పనిచేయలేదని…మీకు సైన్స్ స్కూల్స్ లేకపోతే మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎలా ప్రవేశం కల్పిస్తారని ఆయన అన్నారు.