ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని పట్టించుకోకుండా వైద్యులు, సిబ్బంది డ్రమ్ముల మోతతో నృత్యాలు చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగదారులు వైద్యులు, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలిని కోరుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పదవి విరమణ చేశారు. ఉద్యోగికి వీడ్కోలు పలికేందుకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లతో వైద్యులు, వైద్య సిబ్బంది నృత్యాలు చేశారు.
Also read: IMD Warning: 123 ఇది రెండో సారి.. ప్రజలు జాగ్రత్తగా ఉండండి.. భారత వాతావరణ శాఖ…
మరోవైపు ఈ సంఘటనతో ప్రభుత్వాసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డప్పు చప్పుళ్లకు తట్టుకోలేక అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది చికిత్సపై అనేక ఫిర్యాదులు అందాయి. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్ లలో షేర్ చేయబడింది. దీంతో వైద్యులు, సిబ్బంది రోగులను పట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.
#हापुड़ के सरकारी अस्पताल (CHC) में जमकर उड़ाई गई नियमो की धज्जियां। अस्पताल में बजे ढोल नगाड़े। अस्पताल के डॉक्टर/कर्मी नाचते रहे मरीज चिल्लाते रहे। @MhfwGoUP @nhm_up @UPGovt @CMOfficeUP @brajeshpathakup @myogioffice @MoHFW_INDIA pic.twitter.com/Cf7gja0ofr
— Naveen Gautam (दैनिक भास्कर, जिला प्रभारी हापुड़) (@AajhapurNaveen) April 30, 2024