కొందరి శరీరంలో అనుకోకుండా అనవసరమైన భాగాలు వృది చెందడం మనం చూస్తూనే ఉంటాము. ఇలా వచ్చిన వాటితో అనవసరంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా గమనించే ఉంటాం. అయితే వాటిని సర్జరీ చేయించుకొని తీసేసిన తర్వాతనే వారు పూర్తి ఆరోగ్యంగా మారుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే..
Also read: SRH Vs CSK IPL 2024: సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరోసారి విజృంభిస్తుందా..?!
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు గత సంవత్సర కాలం నుండి కడుపు నొప్పితో బాగా బాధపడుతోంది. ఇకపోతే ఈ విషయాన్ని కాస్త.. ఆమె అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దృష్టికి వెళ్లగా, సదరు మహిళకు టెస్ట్ లు చేయించిన తర్వాత కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు మరో ముగ్గురు వైద్యుల బృందం కలిసి ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించారు.
Also read: Ajith Natarajan Birthday: నట్టు బర్త్ డే పార్టీకి వచ్చి సడన్ సప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో..!
ఇకపోతే ఆ మహిళ కడుపులో దాదాపు 10 కిలోల కణితి ఉంది. ఇక ఈ ఆపరేషన్ ముగిసాకా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ.. తాను పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ డాక్టర్ గాను రాణిస్తున్నారు. ఆయన అవసరమైనప్పుడు డాక్టర్ గా అవతారమెత్తి పలు ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా., ఇదివరకు నల్లమల ప్రాంతాలోని ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యసాయం చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణాలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ బీఆర్ఎస్ గువ్వల బాలరాజు పై పోటీ చేసి గెలిచారు. ఇకపోతే వంశీ ఓ వైపు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు వైద్య సేవలను అందిస్తున్నారు.