హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఏప్రిల్ 5న జరుగుతున్న మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఫామ్ లో ఉన్న జట్లలో ఒకటి. రుతురాజ్ గైక్వాడ్ అండ్ కో మూడు గేమ్ లు అడ్డాగా., వాటిలో రెండు గెలిచారు. వారి చివరి గేమ్ లో మాత్రమే ఓటమి ఎదురైంది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 పరుగుల తేడాతో సీఎస్‌కేపై విజయం సాధించింది. అయితే, ధోని ఈ సంవత్సరం మొదటిసారి బ్యాటింగ్ కు రావడంతో చెన్నై అభిమానులు ఆటను ఆస్వాదించారు. ధోని కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాని, అప్పటికే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలోకి వెళ్ళింది.
Also Read: Ajith Natarajan Birthday: నట్టు బర్త్ డే పార్టీకి వచ్చి సడన్ సప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో..!
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయి ఉంది. ఇక రెండవ మ్యాచ్లో, ముంబై ఇండియన్స్ పై 20 ఓవర్లలో 277-3 స్కోర్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డులను బద్దలు కొట్టి, 31 పరుగుల తేడాతో గేమ్ ను గెలుచుకుంది. అయితే, ఇక మూడో గేమ్ లో గుజరాత్ టైటాన్స్ తో మళ్లీ ఓడిపోయారు. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ XI ఆటగాళ్ల విషయానికి వస్తే..
Also Read: GT vs PBKS: ఉత్కంఠపోరులో గుజరాత్ పై పంజాబ్ గెలుపు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (wk), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ లను అంచనా వేయొచ్చు. అలాగే..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, MS ధోని (WK), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరణ, మహేశ్ తీక్షణలను అంచనా వేయొచ్చు.