Guvvala Balaraju : భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి పెద్ద షాక్‌గా మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డా. గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. సోమవారం తన పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. Windows in shopping Mall: షాపింగ్ మాల్స్ లో కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా?..…
ఆ యువకుడిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తండ్రి జీతం ఉంటూ, తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఈ సమయంలో ఆ యువకుడు తన తమ్ముళ్లని చెల్లిని ఆడించేవాడు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి జీతం ఉన్న ఇంట్లోనే పశువుల కాపరిగా చేరి నాలుగేళ్లు పనిచేసి కుటుంబానికి అండగా నిలిచాడు. అప్పటికి యువకుడి వయసు 13 ఏళ్లు. బడి అంటే ఏంటో తెలియదు. ఆ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అతడిని…
బర్రెలక్క (కర్నె శిరీష) అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. హాయ్ ఫ్రెండ్స్.. అంటూ చేసిన ఒకే ఒక్క రీల్ ఆమెను సోషల్ మీడియా సెన్షేషన్‌ను చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనను రేకెత్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల గొంతుకగా ఆమె.. నాగర్‌కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. ప్రచారంలో దూకుడుగా వ్యవహరించి.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించింది. అయితే ఫలితాల్లో మాత్రం వెనకబడింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే…
నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బంధువులతో కలిసి వచ్చిన యువతిపై గుట్టల ప్రాంతంలోకి లాక్కెళ్లి 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో, ఆమెతో వచ్చిన బంధువుపై కూడా దాడి చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా…
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా రెస్య్కూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు. గంటకు పైగా వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలా ఐనా సరే.. ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి…
Kishan Reddy : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో జరిగిన SLBC టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీశైలం ఎడమ కాలువ టన్నెల్‌లో కొంత భాగం కూలిపోవడంతో, అక్కడ పనిచేస్తున్న కార్మికులు సొరంగం లోపలే చిక్కుకుపోయారు. ఈ హఠాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ విషాద ఘటనపై కేంద్ర బొగ్గు, గణుల శాఖ…
నాగర్ కర్నూల్ లో తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగుచూసింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేలా చేసింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసిన తప్పు వల్ల విద్యార్థులకు మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 లో ఇంటర్మీడియట్ పాస్ అయిన 60 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్మీడియట్ మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. ఈ విద్యార్థులంతా ప్రభుత్వ బిసి వెల్ఫేర్…
Fraud : నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేసిన కల్వకుర్తికి చెందిన ముజమ్మిల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయలతో పరారయ్యాడు నిందితుడు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఇస్తానని ఆకర్షించిన ముజమ్మిల్.. 2020లో ఆర్ సి ఇన్ఫ్రా, ట్రై కాలర్ పేరుతో వెంచర్లు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారం ప్రారంభించాడు. 24 మంది ఏజెంట్లతో…
Manda Jagannatham : మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మందా జగన్నాథం (73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో తెలుగు దేశం పార్టీలో చేరిన ఆయన, మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించి…
Bhatti Vikramarka : నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజర్యారు. సబ్ స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…