యంగ్ హీరోయిన్ నందితా శ్వేతా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.. కానీ ఈ భామ కెరీర్ లో పెద్దగా హిట్లు లేకపోయినా విభిన్న పాత్రలను ఎంచుకుని అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులని ఎంతగానో మెప్పిస్తుంది. ఈ భామ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన సూపర్ హిట్ మూవీ “ఎక్కడికి పోతావు చిన్నవాడా”సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఆ సినిమాలో ఈ భామ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా తరువాత నందిత శ్వేతా కు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ ‘బ్లఫ్ మాస్టర్’, ‘ప్రేమ కథ చిత్రమ్ 2′, కపటధారి’ మరియు ‘అక్షర’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కానీ ఈ భామకు ఆ సినిమాలేవి సక్సెస్ ను అందించలేకపోయాయి..కానీ నిరాశ చెందకుండా వరుసగా సినిమా ఆఫర్స్ దక్కించుకుంటుంది.ఇప్పుడు ఈ భామ తెలుగు, తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.
రీసెంట్ గా నందితా శ్వేతా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిడింబ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అశ్విన్ బాబు హీరో గా నటించాడు మనుషులను చంపుకతినే ఓ జాతికి చెందిన వారిని చేధించే ఆఫీసర్ పాత్రలో నందితా ఎంతో అద్భుతంగా నటించింది. తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఈ భామ వరుసగా సినిమాలలో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది… తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలు కు సంబంధించి అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది..ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.ఈక్రమంలో తాజాగా కొన్ని బ్యూటీఫుల్ పిక్స్ ను షేర్ చేసింది..ఈ భామ ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది… చేతులు పైకెత్తి మరీ నడుము అందాలు చూపిస్తూ మెస్మేరైజ్ చేసింది..ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.