టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఓ సినిమాని మెచ్చుకుంటాడు అంటే అందులో ఏదో ఉందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది వరకు రాజమౌళి ఓ దర్శకుడిని మెచ్చుకోవడమే కాకుండా సినిమా విడుదలకు ముందే ఓ లేఖను కూడా రాసిచ్చాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. కార్తికేయ సినిమా డైరెక్టర్ ‘చందూ మొండేటి; . తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందు మొండేటి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు.
Also Read: kazakhstan: భార్యను కొట్టి చంపిన కజకిస్థాన్ మాజీ మంత్రి.. సీసీటీవీలో రికార్డు
ఇంటర్వ్యూలో చందు మొండేటి మాట్లాడుతూ.. నిఖిల్ మినహా కార్తికేయ సినిమాలో పనిచేసిన వాళ్ళందరం పూర్తిగా కొత్త వాళ్ళమే. దాంతో ఆ సినిమాకు పెద్దగా సందడి చేయలేదు. కానీ., టీజర్ ని విడుదల చేసిన తర్వాత రాజమౌళి లైక్ చేసి తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎవరో ఫోన్ చేసి చెబితే కానీ నాకు విషయం తెలియదు. ఆ తర్వాత నేను చూశాను. ఆ విషయం నాకు సినిమా విజయం కంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాజమౌళి మా సినిమా గురించి ట్వీట్ చేసినప్పుడు , సినిమా విడుదలకు ముందే సినిమాకు మంచి బజ్ వచ్చిందని., అలాగే టీజర్, ట్రైలర్ లను మెచ్చుకుంటూ.. సినిమా విడుదలకు ముందే సినిమా హిట్ అవుతుందని చెప్పి ఓ లేఖను రాసిచ్చాడు.
Also Read: IPL 2024: ఐపీఎల్ హిస్టరీలో మునుపెన్నడూ చూడని రికార్డు.. అదరకొడుతున్న భారత యువ బ్యాటర్లు..
ఆ లేఖను ఫ్రేమ్ కట్టుకొని మరీ పెట్టుకున్నానని చందూ తెలిపాడు. సినిమా రిలీజ్ కంటే ముందే రాజమౌళిని ఇంప్రెస్ చేయడం, అది కూడా నా మొదటి సినిమాకు.. అంతకంటే పెద్ద సంతోషం లేదనిపించిందని తెలిపారు. రాజమౌళికి ఏవైనా టీజర్లు, ట్రైలర్లు, సినిమాలను ఇష్టపడి ఎవరైనా బాగా చేసినప్పుడు వాటి గురించి మాట్లాడి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.