2022 బంగ్రారాజు హిట్ తర్వాత అక్కినేని హీరోలు నాగార్జున, చైతన్య, అఖిల్ సరైన హిట్ లేక స్ట్రగుల్ చేశారు. కానీ తండేల్ సక్సెస్ ట్రాక్ ఎక్కి… మూడేళ్ల ఫ్లాప్స్‌కు చెక్ పెట్టాడు చైతూ. నాగార్జున కూలీ, కుబేరలో నెగిటివ్ రోల్ చేసి అభిమానుల్ని కొంచెం శాటిస్పాక్షన్ చేయగలిగాడు. ఇక అఖిల్.. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మూడేళ్లుగా ఫ్యాన్స్‌తో టచ్ కోల్పోయాడు.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
2025లో ఫ్యాన్స్‌ను అక్కినేని హీరోలు కాస్త కూస్తో శాటిస్పాక్షన్ చేసినా అది సరిపోలేదు. అందుకే 2026లో మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇయర్ నాగ్‌కు స్పెషల్ ఇయర్ కాబోతోంది. ఇప్పటి వరకు 99 సినిమాలు కంప్లీట్ చేసిన కింగ్ నెక్ట్స్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. తమిళ దర్శకుడు రా కార్తీక్ టేకప్ చేస్తున్న ఈ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నాగ్ స్పెషల్ మూవీ కావడంతో మనం తరహాలో చైతూ, అఖిల్ కూడా ఇందులో కీ రోల్ చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య తండేల్ తర్వాత కార్తీక్ వర్మ దండు దర్వకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ వృష కర్మ చేస్తున్నాడు. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత బెదురులంక ఫేం క్లాక్స్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడట. ఇక హలో తర్వాత సరైన హిట్ లేక ఏజెంట్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత మూడేళ్లుగా గ్యాప్ తీసుకున్న అఖిల్ కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ లెనిన్‌తో కంబ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇలా అక్కినేని హీరోలు త్రీ డిఫరెంట్ జోనర్స్‌తో ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.