Dhanush: వరుస సినిమాల హిట్‌తో మంచి జోరు మీద ఉన్న హీరో ధనుష్. ఆయన భాషతో సంబంధం లేకుండా కోలీవుడ్, టాలీవుడ్‌లో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక వైపు హీరోగా చేస్తూనే డైరెక్టర్‌గా కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు ఈ స్టా్ర్ హీరో. ధనుష్ అంటే హీరో, డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా ఒక మంచి సింగర్ కూడా వెంటనే గుర్తుకు వస్తారు. ఆయన పాడిన ‘వై దిస్ కొలవరి’ పాటకు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఇప్పటికీ కూడా ఈ పాట సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. ఇటీవల ఈ స్టార్ హీరో ఈ పాట గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంతకీ ధనుష్ ఈ పాట గురించి ఏమన్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: RGV-Rajamouli : ‘‘నాస్తికుడు వల్ల దేవుడి స్థాయి తగ్గదు” – జక్కన్న తరపున ఆర్జీవీ పంచ్ పోస్ట్ వైరల్
ఈ పాట ధనుష్ – శ్రుతిహాసన్ నటించిన ‘3’ సినిమాలోనిది. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు. ఈ సినిమా 2012లో విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. సినిమాలో భాగంగా రిలీజ్ అయిన ‘వై దిస్ కొలవెరి’ పాట ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. వాస్తవానికి ఈ పాట కారణంగానే ఈ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకూ యూట్యూబ్‌లో ఈ పాటకు ఏకంగా 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఇటీవల దుబాయ్‌లో వాచ్ వీక్ కార్యక్రమంలో ఈ స్టార్ హీరో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఈ పాట గురించి మాట్లాడుతూ.. ‘సరదాగా ఒకరోజు చిన్న ట్యూన్ చేసి లిరిక్స్ పాడాం. తర్వాత దాని గురించి మర్చిపోయాం. కొన్ని నెలలకు ఆ పాటను వినాలనిపించింది. విన్న తర్వాత అది చాలా ఫన్నీగా ఉండడంతో దాన్ని సినిమాలో భాగం చేశాం. అయితే అది సూపర్ హిట్ అయింది. ఊహించని స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పాటలో లిరిక్స్ తమిళ్, ఇంగ్లిష్ రెండు భాషలు కలిపి ఉంటాయి. అది వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. దశాబ్దం గడిచినా ఆ పాటను మాత్రం ఆడియన్స్ మర్చిపోవడం లేదు’’ అంటూ ధనుష్ సరదాగా చెప్పారు.
READ ALSO: Ravi Naidu Animini: ఇంటర్నేషనల్ స్టేడియంగా మారనున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం..!