జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అయితే.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇదిలా ఉంచితే.. శేఖర్ కమ్ములతో కూడా ఓసినిమాను ప్రకటించారు ధనుష్. అయితే తాజాగా తన గోల్డెన్ జూబ్లీ చిత్రంను కూడా ధనుష్ వెల్లడించారు. ఈ సినిమాను ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధనుష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం లేదు. కానీ ఈ సినిమాలో ధనుష్‌దే కీలక పాత్ర.
Also Read : Magha Amavasya: నేడు మాఘ అమావాస్య.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
అయితే.. సినిమాలో అతిధి పాత్రలో మాత్రమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు ధనుష్. పవర్ పాండి తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. తాజా అప్‌డేట్‌ల ప్రకారం.. ధనుష్ మెయిల్ లీడ్ కోసం రాచ్చసన్, మట్టి కుస్తి హీరో విష్ణు విశాల్‌ను తీసుకున్నాడు. ఫీమెల్ లీడ్ కోసం యువ తమిళ నటి దుషారా విజయన్ కనిపించనున్నారు. కాళిదాస్ జయరామ్ మరియు SJ సూర్య కూడా కీలక పాత్రల కోసం చర్చలు జరుపుతున్నారు. దీనికి తాత్కాలికంగా D50 అని పేరు పెట్టారు. నార్త్ మద్రాస్ పరిసరాల్లో ఈ సినిమా సాగుతుంది. ఈ స్పెషల్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Also Read : Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళుతుండగా విషాదం.. కారులో వున్న ఐదుగురు మృతి