Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళుతుండగా విషాదం.. కారులో వున్న ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wedding Shoot: భద్రాద్రి కొత్తగూండె జిల్లా కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇల్లెందు మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు-లారీ ఢీకొన్నాయి. బలంగా ఢీకొట్టడంతో..కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నవారు మృతి చెందినట్లు సమాచారం. కారు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని, మరొకరు దవాఖానకు తీసుకెళ్తండగా చనిపోయారు. అయితే స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
Read also: Fire Accident Medak: మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆహుతైన షాపులు
Also Read
మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్, శివగా, గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్‌గా గుర్తించారు. వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తుందని తెలిపారు. కారులో వెడ్డింగ్ సూట్‌కి సంబంధించిన వస్తులు ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వీరంతా మోతేకి వెడుతున్నట్లు తెలుస్తోంది. కారు టీఎస్03ఎఫ్ సీ 9075 నంబరు గల మహబూబాబాద్ వైపు నుంచి ఇల్లందు వెడుతోంది. కాగా.. ఈ కారును ఏపీ16టీజీ 3859 అనే నంబరు గల ఇల్లెందు నుంచి మహబూబాబాద్ వైపు వెడుతున్న లారీ వేగంగా ఢీ కొట్టింది.. దీంతో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే లారీలో వున్న వ్యక్తి పారారీలో వున్నాడా? లేక అదుపులోకి తీసుకున్నారా? అనే విషయంపై ఇంకా నిర్ధారణ రాలేదు. అయితే.. కారులో ప్రయాణించే వ్యక్తులందరూ చనిపోవడం లారీ స్పీడ్ గా నడపడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందా? లారీ డ్రైవర్ తాగి బండినడిపాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.
Giant Pendulum : జీవితంలో మరోసారి జాయింట్ వీల్ పదం అంటే హడలిపోతారేమో !
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?