దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోడీ నిలిచిపోయారన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి కొండా సంగీత రెడ్డి. మంగళవారం ఉదయం వికారాబాద్ పట్టణంలోని ఓల్డ్ గంజ్ ప్రాంతంలో తన భర్త గెలుపుని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కొండా సంగీత రెడ్డి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు.
మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ఆయన సతీమణి కొండా సంగీతా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కే పురం, టెలిఫోన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలి సారి వరంగల్ జిల్లాకు వస్తుండటంతో తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రధాని పర్యటన పై మీడియా సమావేశం నిర్వహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా వరంగల్ కు వస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు.