Devara : దేవర.. కలెక్షన్లలో అస్సలు ఆగేదేలే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara : దేవర బాక్సాఫీస్ దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. మిక్స్డ్ టాక్‌తో మొదలైన దేవర బాక్సాఫీస్ వేట.. ఫస్ట్ డే 172 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 304 కోట్లు వసూలు చేయగా.. ఫస్ట్ వీక్‌లో 405 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అన్నీ చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టింది. అయితే.. ఓవర్సీస్‌లో మాత్రం దేవర ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో దుమ్ముదులిపేస్తున్నాడు. ఇప్పటికే ఓవర్సీస్ ఇండియన్ మూవీస్‌లో టాప్ ప్లేస్ దక్కించుకున్న దేవర.. యూఎస్ మార్కెట్‌లో సాలిడ్ వసూళ్లను రాబడుతోంది. నార్త్ అమెరికాలో 5.6 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ క్రాస్ చేసి.. 6 మిలియన్ దిశగా వెళుతుంది. అంటే.. ఒక్క నార్త్ అమెరికాలోనే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. 47 కోట్లు రాబట్టిందన్నమాట. ఈ వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also:Mallareddy Mass Dance: బతుకమ్మ సంబరాల్లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్
Also Read
- 93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
దీంతో.. నార్త్ అమెరికాలో దేవర బాక్సాఫీస్ నెంబర్ ఎక్కడ ఆగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇండియాలోను దేవర కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా వరకు దేవరకు తిరుగులేదు. కాబట్టి.. దేవర మేకర్స్‌కు భారీ లాభాలు రావడం గ్యారెంటీ. ఇక ఆచార్యతో కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ చూసిన కొరటాల.. దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆచార్య తర్వాత కేవలం ఎన్టీఆర్ మాత్రమే కొరటాలను నమ్మాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు కొరటాల. దేవరతో తానేంటో చూపించాడు. అందుకే.. ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్‌లు చూసిన తనకు.. దేవర సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో దేవర పార్ట్ 1 నిర్మించారు. మరి లాంగ్ రన్‌లో దేవర ఎంత రాబడుతుందో చూడాలి.
Read Also:Gopi Chand : మరోసారి ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న గోపీచంద్
తాజావార్తలు
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!