Gopi Chand : టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే.. ప్రభాస్-గోపీచంద్ ముందు వరుసలో ఉంటారు. ఈ ఇద్దరు ‘వర్షం’ సినిమాలో కలిసి నటించారు. ప్రభాస్ హీరోగా గోపీచంద్ విలన్‌గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కానీ మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటించే సందర్భం రాలేదు. కాకపోతే.. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ఈ ఇద్దరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇక గోపీచంద్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ విశ్వం. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. గత కొంత కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాను తెరకెక్కించాడు. శ్రీను వైట్లతో పాటు గోపీచంద్ కూడా ఈ సినిమాతో కంబ్యాక్ కావాలని చూస్తున్నాడు.
Read Also:Dasara : విజయదశమి బరిలో పోటీ పడనున్న సినిమాలు ఇవే..
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంచనాలు పెంచేసింది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో.. ఓ ఇంటర్య్వూలో గోపీచంద్‌కు మళ్లీ విలన్‌గా నటిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు మ్యాచో స్టార్. విలన్ రోల్ చేయాలని లేదు.. కానీ ప్రభాస్ సినిమాలో అయితే విలన్‌గా నటిస్తానని.. చెప్పుకొచ్చాడు. దీంతో.. మరోసారి ప్రభాస్, గోపీచంద్ బిగ్ స్క్రీన్ ఢీ కొడితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే ఈ ఇద్దరు తలపడితే బాక్సాఫీస్ బద్దలవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. పైగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి.. గోపీచంద్ పాన్ ఇండియా విలన్‌గా సెట్ అవడం గ్యారెంటీ. మరి.. మరోసారి ప్రభాస్‌కు గోపీచంద్ కలిసి నటిస్తారేమో చూడాలి.
Read Also:Terrible Incident: తాగొచ్చి గొడవ చేసిన తండ్రి.. కిరాతకంగా హతమార్చిన కొడుకు..