NTV Telugu Site icon

Deputy CM Bhatti Vikramarka: తప్పు చేశారా లేదా అని చెప్పాల్సింది కేటీఆర్ కాదు..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikramarka: హాస్టల్ విద్యార్థులకు మెనూను మార్చేశామని.. ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు ఇస్తామని.. ప్రతి నెలా చెకప్ చేయిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదల కష్టాలు ఏంటో మాకు తెలుసన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు ఛార్జీలు పెంచామన్నారు. ముఖ్యమంత్రి, అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం 40 శాతం వరకు విద్యార్థులకు అందించే ఛార్జీలు పెంచామన్నారు. పిల్లలు ఎదిగేందుకు కావాల్సినవన్ని సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేటీఆర్‌ తప్పు చేశారా లేదా అని చెప్పాల్సిందని ఆయన కాదని.. ఏం తప్పు జరిగిందో విచారణ సంస్థలు తేలుస్తాయన్నారు.

Read Also: KTR: ఈ-కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం

అప్పులకు మేం వ్యతిరేకం కాదని.. అప్పులు ఎలా ఉపయోగించారు అన్నదే ముఖ్యమన్నారు. రూ.లక్ష కోట్లు కాళేశ్వరంలో పోస్తే.. ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఆర్థిక శాఖ నిర్వహణ భారమే.. కానీ అది పార్టీ అప్పగించిన బాధ్యత అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. పేదల పన్నులతో వచ్చేఆదాయం తప్పుదారి పట్టకూడదని జాగ్రత్త పడుతున్నామన్నారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్‌ వచ్చిందని.. ఏం చేయాలన్నది అధికారులు స్టడీ చేస్తున్నారన్నారు. దూకుడుగా అరెస్టులు చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. విచారణలు పూర్తవ్వాలని.. నిబంధనల మేరకే వ్యవహారం ఉంటుందన్నారు. భూమి లేని పేదలకు సాయం చేస్తామంటే.. బీఆర్‌ఎస్‌కు నచ్చడం లేదని ఆయన విమర్శించారు. అందుకే తను ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారన్నారు.

Read Also: TG CETs: ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్‌ల నియామకం

మధ్యాహ్నం మీడియా చిట్‌చాట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ కెప్టెన్‌ లేని నావ అంటూ ఆయన పేర్కొన్నారు.తుపాన్‌లో చిక్కుకున్న షిప్ ఎక్కడికి వెళ్తుందో తెలియదన్నారు. నాయకుడు లేకుంటే పార్టీ ఎలా ఉంటుందో బీఆర్‌ఎస్ పరిస్థితి అలా ఉందన్నారు. సభలో చర్చ జరగాలని బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. రచ్చ చేసి బయటకు వెళ్ళాలి అని బీఆర్‌ఎస్ ఉందన్నారు. చర్చ జరగాలి అనేది మా ఆలోచన అన్నారు. బీఆర్‌ఎస్ సభను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. భూమి లేని వారికి డబ్బులు ఇస్తాం అంటే.. బీఆర్ఎస్‌ అడ్డుకుంటుందన్నారు.