హాస్టల్ విద్యార్థులకు మెనూను మార్చేశామని.. ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు ఇస్తామని.. ప్రతి నెలా చెకప్ చేయిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదల కష్టాలు ఏంటో మాకు తెలుసన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు ఛార్జీలు పెంచామన్నారు. ముఖ్యమంత్రి, అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం 40 శాతం వరకు విద్యార్థులకు అందించే ఛార్జీలు పెంచామన్నారు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా.. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. అందులో భాగంగా.. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వాలని.. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Construction Workers: లేబర్ కార్డు పొందిన భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని, ఏవైనా వ్యాధులు నిర్ధారణ అయితే సంబంధిత ఆసుపత్రులకు రెఫర్ చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ ప్రకటించింది.