Bhatti Vikramarka: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: యునైటెడ్ స్టేట్స్ కాన్స్ లేట్ జనరల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన యుఎస్ 248 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా కాన్సిలేట్ జనరల్ జెన్నీ ఫర్ లార్సన్, యు.ఎస్ ఎంబర్సీ రేర్ అడ్మిరోల్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రంలో అమెరికా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఈ వేడుకలకు తనను ఆహ్వానించిన అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లారెన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా 248వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకర అంశంగా పేర్కొన్నారు. ఇది ఒక చారిత్రాత్మక అంశం, ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లేలా చేసిన అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచం మొత్తానికి పండుగ అని తెలిపారు.
Jyothi Purvaj: హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పెళ్లామైపోయి.. ఆసక్తి రేకెత్తిస్తున్న నటి కామెంట్స్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
భారతదేశానికి వ్యూహాత్మకంగా కూడా అమెరికా మంచి మిత్ర దేశం అన్నారు. అమెరికా అతి ప్రాచీన, పెద్దదైన ప్రజాస్వామిక దేశమని అభివర్ణించారు. అమెరికా స్వాతంత్రం మూలంగానే మనం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, హక్కులను అనుభవిస్తున్నామన్నారు. తెలుగు ప్రజలకు అమెరికాతో అవినాభావ సంబంధం ఉందన్నారు. మన సినిమా షూటింగులు అమెరికాలో ఎక్కువగా జరుగుతాయి., మన పిల్లలు ఉన్నత చదువులకు అమెరికాకు ఎక్కువగా వెళుతుంటారు. ఉన్నతమైన జీవితం కోసం అక్కడికి వెళుతుంటారు, అమెరికాలో ప్రస్తుతం అతివేగంగా విస్తరిస్తున్న భాష ఏదైనా ఉందా అంటే అది తెలుగు భాష మాత్రమేనని, రాబోయే రోజుల్లో తాను ఇలాంటి వేడుకల్లో తెలుగులోనే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. భారతదేశ ప్రజలు అభివృద్ధి చెందేందుకు అమెరికా అండగా నిలిచిందన్నారు.
Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ముహూర్తం, వేదిక ఫిక్స్
భారతీయులను అమెరికన్లు సాదరంగా ఆహ్వానించి అక్కడి పౌరులుగా గౌరవ మర్యాదలు ఇస్తారని వారితో సమానంగా చూసుకుంటారని తెలిపారు. అమెరికా, భారత్ మధ్య స్నేహం విషయానికొస్తే హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. వ్యాపారం, సంస్కృతి వంటి విషయాల్లో తెలంగాణ అమెరికా మధ్య బలమైన బంధం ఉంది. ఇవి రోజుకు బలపడి రాబోయే రోజుల్లో హైదరాబాద్, అమెరికాల మధ్య మరింత బలమైన బంధం ఏర్పడుతుందన్నారు. అటు భారత్ ఇటు అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల సంవత్సరం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం భారత్లో ఎన్నికలు ముగియగా రాబోయే సంవత్సరం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి.. ఆ ఎన్నికల్లో అమెరికాల్లో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!