Jyothi Purvaj Intresting Comments: ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ “ఏ మాస్టర్ పీస్” సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్స్పీరియన్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నట్టు టీం చెబుతోంది. ఇరాక్ ఈ రోజు హైదరాబాద్ లో “ఏ మాస్టర్ పీస్” సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Boyapati: బాబు ప్రమాణస్వీకార బాధ్యతలు బోయపాటి చేతికి.. సినిమా వేడుకలను తలదన్నేలా?
ఈ సందర్భంగా హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ – సీరియల్స్ ద్వారా నేను మీకు పరిచయమే. “ఏ మాస్టర్ పీస్” సినిమాతో నటిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నా, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నా పర్సనల్ లైఫ్ ఒక టర్న్ తీసుకుంది. సుకుతో నా మ్యారేజ్ జరిగింది, అప్పటినుంచి టాలీవుడ్ నా మెట్టినిల్లు అయిపోయింది అని అన్నారు. “ఏ మాస్టర్ పీస్” సినిమా టీజర్ చూశారు మీకు నచ్చిందని ఆశిస్తున్నా, దర్శకుడు సుకు నా మూవీలో నా క్యారెక్టర్ గురించి చెప్పారు. ఈ మూవీ టీమ్ అంతా ఫ్యామిలీలా మారిపోయారు. ఇక నుంచి మూవీస్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా అని ఆమె కామెంట్ చేసింది. ఆమె కన్నడ నటి. తెలుగులో గుప్పెడంత మనసు అనే సీరియల్ లో రిషి అనే క్యారెక్టర్ కి తల్లి పాత్రలో సాయి కిరణ్ కి భార్య పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.