ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య పొలిటికల్ దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే జైల్లో నుంచి కేజ్రీవాల్ పరిపాలించడం కుదరని వీకే సక్సేనా వ్యాఖ్యానించారు. అనంతరం ఆప్ మంత్రులు తీవ్రంగా ధ్వజమెత్తారు. పరిపాలనలో జోక్యం చేసుకోవద్దని మండిపడ్డారు. తాజాగా ఆప్ మంత్రుల తీరుపై లెఫ్టినెంట్ గవర్నర్ గరం గరం అవుతున్నారు. దీంతో ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. పాలనా వ్యవహారాల్లో ఢిల్లీ మంత్రులు సహకరించడం లేదని ఆరోపిస్తూ.. కేంద్ర హోంశాఖకు వీకే సక్సేనా లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: CSK vs KKR: చెన్నై ముందు స్వల్ప లక్ష్యం..
ఆయా శాఖల పనితీరుపై చర్చించేందుకు మంత్రులను సమావేశాలకు పిలిచినా సాకులు చెబుతూ నిరాకరిస్తున్నారని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో వెల్లడించారు. డిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌జైల్లో ఉన్నవేళ ఈ వివాదం చెలరేగింది. కేజ్రీవాల్ అరెస్టు, తదనంతర పరిణామాల నేపథ్యంలో.. ఢిల్లీలో రోజువారీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసేందుకు మంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం అవసరం అని వీకే.సక్సేనా తెలిపారు. ప్రజారోగ్యం, వేసవి కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఈనెల 2న సమావేశానికి పిలిచినప్పటికీ.. మంత్రులు గోపాల్ రాయ్, కైలాశ్ గహ్లోత్, ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లు నిరాకరించారని చెప్పారు. ఎన్నికల నియమావళిని సాకుగా చూపుతున్నారని.. వారు బాధ్యతగా వ్యవహరించడం లేదని లెఫ్టినెంట్ గవర్నర్ ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Shahbaz Sharif: పాకిస్థాన్ ప్రధాని మొదటి పర్యటనలోనే సౌదీ అరేబియా షాక్..
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టిస్తూ పాలనను పట్టాలు తప్పిస్తున్నారని వీకే సక్సేనాపై ఆప్ ప్రభుత్వం పలుమార్లు ఆరోపణలు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం-లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఈ సంఘర్షణ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇదిలా ఉండగా గత నెల 21న అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అక్కడి నుంచే సీఎంగా పరిపాలన సాగిస్తున్నారు. ఇక కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారం కోర్టు విచారించనుంది. ఇక ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు