ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య పొలిటికల్ దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే జైల్లో నుంచి కేజ్రీవాల్ పరిపాలించడం కుదరని వీకే సక్సేనా వ్యాఖ్యానించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన పదవిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఆప్ మంత్రులు, ముఖ్య నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాశారు. పేదలకు ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని ఆపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు ఆరోపించారు.