Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. బ్రిక్స్‌లో సభ్య దేశాధినేతలంతా హస్తినకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వీవీఐపీ జోన్లో ఉంది. నగరమంతా సందడి.. సందడిగా ఉంది. ఇలాంటి తరుణంలో వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. శని, ఆదివారాల్లో కీలక సమావేశాలు జరగనున్న తరుణంలో కేంద్ర వాతావరణ శాఖ వాన కబురు చెప్పింది.
ఢిల్లీ, యూపీ, బీహార్ సహా 12 రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బెంగాల్-ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు హెచ్చరిక జారీ చేశారు. శనివారం 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
Also Read
- BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
- PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
- Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు వాయువ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. దీని కారణంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. రేపు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్షం కురవనుంది. వారాంతంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ-ఎన్సీఆర్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో రెడ్ అలర్ట్
ఢిల్లీ-ఎన్సీఆర్లో శుక్రవారం అనేక ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ రాత్రి వరకు వర్షం పడే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం కూడా ఢిల్లీలో వర్షం కురుస్తుందని అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల పాటు ఆదివారం వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?