BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
- ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సమావేశాలు
- బ్రిక్స్ బ్యాగౌండ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారతదేశం వేదికగా బ్రిక్స్ (BRICS) సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా భారత్ వైపు ఫోకస్ అయింది. అంతర్జాతీయ మీడియా అంతా ఢిల్లీలో వాలిపోయింది. బ్రిక్స్ వేదికగా ఏం జరగబోతోందని దృష్టి పెట్టాయి. ఇదంతా ఒకెత్తు అయితే.. అసలు బ్రిక్స్ ఎలా ఏర్పడింది. అసలు ఎక్కడ బీజం పడింది. దీని బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి లుక్కేసేయండి.

Also Read
- Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
- PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
- Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
బ్రిక్స్ (BRICS) అనేది ప్రపంచంలో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమితో ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ కూటమిలో పదకొండు ప్రధాన వర్ధమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాలను ఒక్కచోట చేర్చుతుంది. ఈ కూటమిలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారతదేశం, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలతో కూటమి ఏర్పడింది. దీంతో ఈ కూటమికి (BRIC) అనే పేరు పెట్టారు. ఈ పేరులోని అక్షరాల ప్రారంభంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలను సూచిస్తుంది. కాలక్రమేణా అది బ్రిక్స్‌గా మారింది. దక్షిణాఫ్రికా చేరడంతో ‘S’ కలిపారు. దీంతో బ్రిక్స్‌గా అవతరించింది.
చరిత్ర ఇదే..
ఈ కూటమి 2006లో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన విదేశాంగ మంత్రుల మొదటి సమావేశంలో ఇది అధికారికంగా బ్రిక్ (BRIC)గా ఏర్పడింది. తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలోని యెకాటెరిన్బర్గ్లో జరిగింది. అనంతరం 2010లో న్యూయార్క్‌లో జరిగిన బ్రిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను కూడా చేర్చుకోవడంతో బ్రిక్ కాస్త బ్రిక్స్‌గా మారింది. దీంతో దక్షిణాఫ్రికా 2011లో సాన్యాలో జరిగిన 3వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైంది. అప్పటి నుంచి బ్రిక్స్ (BRICS)గా పిలుస్తున్నారు.
ఇక ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ జనవరి 2024 నుంచి బ్రిక్స్ లో పూర్తి సభ్య దేశాలుగా చేరాయి. అనంతరం ఇండోనేషియా జనవరి 2025లో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్థాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం 2025లో భాగస్వామ్య దేశాలుగా బ్రిక్స్‌లో చేరాయి. ఈ కూటమి ప్రధానంగా మూడు ప్రధాన స్తంభాల మీద ఏర్పడింది.
ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, వాతావరణ మార్పు, ఆహారం, ఇంధన భద్రత, అంతర్జాతీయ ఆర్థిక మరియు ద్రవ్య పరిస్థితి, టెలికమ్యూనికేషన్లు, వ్యవసాయం, కార్మిక మరియు ఉపాధి, అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణం, వాణిజ్యం, WTOతో సహా అనేక రకాల ప్రపంచ సమస్యల్లో BRICS సహకారం తన పరిధిని విస్తరిస్తూ వచ్చింది.
తాజావార్తలు
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
-
Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?