Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్ మిస్సవ్వడం చూస్తే, ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పోలిట్‌బ్యూరో జిన్‌పింగ్ అధికారాలకు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. గత 10 ఏళ్లలో బ్రిక్స్‌కు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి.
17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్‌లోని రియో డి జనీరో చేరుకున్నారు. గలేయో అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి బ్రెజిల్‌కు రెండు దశల పర్యటన ఇది. ఈ పర్యటనలో, రియోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న తర్వాత ప్రధాని రాజధాని బ్రెసిలియాకు రాష్ట్ర పర్యటన చేస్తారు. Also Read:Elon Musk: ఎలాన్ మస్క్…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్‌లో జరిగి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సౌత్‌లోని అనేక కీలక దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరించేందుకు జూలై 2 నుంచి 9 వరకు 5 దేశాల్లో పర్యటిస్తారు.
Russia: రష్యా-భారతదేశం-చైనా (RIC) ఫార్మాట్‌లోని కార్యకలాపాల పునరుద్ధరణకు రష్యా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం అన్నారు. చైనా వ్యతిరేక కుట్రలోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Cyber Attack On Russia: రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్‌దాడికి లక్ష్యంగా చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. అధికారిక వెబ్‌సైట్, మౌలిక సదుపాయాలపై బుధవారం నాడు ఉదయం వివిధ విదేశాల నుంచి భారీ సైబర్ ఎటాక్ ప్రారంభమైంది.…
ప్రధాని మోడీ రష్యా పర్యటన ముగిసింది. బ్రిక్స్ సదస్సు కోసం రెండ్రోజుల పర్యటన కోసం మోడీ రష్యా వెళ్లారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో మోడీ పాల్గొని దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు.
PM Modi: ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు.
ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ చేరుకున్నారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.
India Russia: ప్రధాని నరేంద్రమోడీ 16వ బ్రిక్స్ సమ్మిట్ కోసం రష్యా వెళ్లారు. ఈ రోజు ప్రధాని మోడీ, రష్యా అధినేత పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. మాస్కో-న్యూఢిల్లీ సంబంధాలు చాలా ‘‘ప్రత్యేమైనవి, విశేషమైనవి’’, డైనమిక్‌గా అభివృద్ధి చెందాయని పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు మోడీకి నవ్వు తెప్పించింది. ‘‘రెండు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఉన్నాయి. అనువాదం లేకుండా తన వ్యాఖ్యల్ని ప్రధానిమోడీ అర్థం చేసుకుంటారు’’ అని రష్యా అధ్యక్షుడు…
Jaishankar: భారత-రష్యా సంబంధాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారత రష్యా చరిత్రను పరిశీలిస్తే.. భారత ప్రయోజనాలను ప్రభావితం చేసేలా రష్యా ఎప్పుడూ ఏమీ చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్ సమావేశం కోసం రష్యాకి వెళ్తున్న సందర్భంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రష్యా, ఇండియా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించలేదని చెప్పారు.