Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకర్డ్ బెల్ బ్రాండ్‌ను ఏసర్ కంపెనీ ఐఎఫ్ఏ 2026లో సరికొత్త రంగులతో రీలాంచ్ చేసింది. పాత కాలపు బేజ్ కలర్ బల్కీ డెస్క్‌టాప్‌లు, సిఆర్టి మానిటర్ల స్థానంలో ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో వంటి ఆకర్షణీయమైన రంగుల్లో సరసమైన ధరలకే టెక్ ఉత్పత్తులను తీసుకురావాలని ఏసర్ గ్రూప్ భావిస్తోంది. ఈ కొత్త శ్రేణిని యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల వినియోగదారుల కోసం మాత్రమే అందిస్తున్నామని, ప్రస్తుతానికి అమెరికాలో ఈ రీలాంచ్ లేదని ఏసర్ స్పష్టం చేసింది. గతంలో అమెరికాలో అత్యంత ఆదరణ పొందిన ఈ బ్రాండ్, ఈసారి కేవలం కంప్యూటర్లకే పరిమితం కాకుండా విస్తృతమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తోంది.
ఈ కొత్త సిరీస్ లో భాగంగా విడుదలైన ‘డాట్బుక్’ ల్యాప్‌టాప్ 14.5 అంగుళాల ఐపిఎస్ డిస్ప్లే, ఇంటెల్ కోర్ 3 ఎన్355 ప్రాసెసర్, 16జీబీ వరకు డ్డీఆర్4 రామ్, 512జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. కేవలం 2.9 పౌండ్ల బరువుండే ఈ ల్యాప్‌టాప్ 7 గంటల బ్యాటరీ జీవితాన్ని ఇస్తుందని, దీని ధర సుమారు 499 యూరోల (దాదాపు $580) నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బ్రౌజింగ్, స్ట్రీమింగ్ వంటి సాధారణ దైనందిన అవసరాల కోసం దీనిని రూపొందించారు. అయితే పాకర్డ్ బెల్ కేవలం ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా డాట్లూప్ సూట్‌కేస్ టర్మ్టెబుల్, డాట్‌లైన్ 4జీ ఫీచర్ ఫోన్, డాట్లుక్ ఆడియో గ్లాసెస్, హెడ్‌ఫోన్స్, రింగ్ లైట్, డెస్క్ యాక్సెసరీస్, స్టీసీతో కలిసి తయారు చేసిన కనెక్టెడ్ మినీ-స్టీమర్ వంటి విభిన్న రకాల గాజెట్లను కూడా లాంచ్ చేస్తోంది.
Also Read
- EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
- Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
- AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
- Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
28 దేశాల్లో బహుభాషా మద్దతుతో పాటు ఏసర్ ఇప్పటికే ఉన్న ఈఎంఈఏ సర్వీస్ సెంటర్ నెట్వర్క్ ద్వారా కస్టమర్లకు సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. 1990ల తొలినాళ్లలో వాల్‌మార్ట్, బెస్ట్ బై వంటి అమెరికన్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాకర్డ్ బెల్, 1994 నాటికి ఐబీఎంను వెనక్కి నెట్టి అమెరికాలో మూడో అతిపెద్ద పీసీ తయారీదారుగా నిలిచింది. ఏసర్ 2008లోనే ఈ కంపెనీలో వాటాలు కొనుగోలు చేసినప్పటికీ, ప్రస్తుతానికి ఈ రీలాండ్ను మాత్రం పూర్తిగా అట్లాంటిక్ అవతలి మార్కెట్లపైనే కేంద్రీకరించింది. అమెరికాలో లభ్యతపై ఇంకా స్పష్టత లేదు.
తాజావార్తలు
-
EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
-
SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
-
Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!