Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
- పశ్చిమ బెంగాల్లో మాంసాహార వివాదం
- ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి
- నాన్‌వెజ్ వివాదానికి తెర దించిన బీజేపీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో చేపలు, మాంసాహారంపై మరోసారి రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. దీంతో ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్‌కతాలోని కలీఘాట్ ఆలయంలో కౌశికి అమావాస్య సందర్భంగా సంప్రదాయ చేపల భోగ్‌ను స్వీకరించారు. బెంగాల్‌లోని శాక్త సంప్రదాయాల్లో చేపల నైవేద్యానికి ఉన్న ప్రాధాన్యతను ఇది ప్రతిబింబిస్తుందని బీజేపీ పేర్కొంది. దుర్గాపూజ సమయంలో బెంగాలీలు మాంసాహారం తీసుకోవద్దంటూ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ధీరేంద్ర శాస్త్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగాల్ ప్రజల ఆహారపు అలవాట్లను బయట నుంచి వచ్చిన మతపెద్దలు నిర్ణయించకూడదని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు.
కౌశికి అమావాస్య సందర్భంగా కలీఘాట్ ఆలయాన్ని సందర్శించిన సువేందు అధికారి అక్కడ సంప్రదాయ చేపల భోగ్‌ను స్వీకరించారు. బెంగాల్లో శాక్త సంప్రదాయంలో దేవతలకు చేపలు, మాంసాహారం నైవేద్యంగా సమర్పించే ఆచారం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. బెంగాల్లో ప్రజలు ఏం తినాలనే విషయంలో ఇతరులు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య కూడా బెంగాలీలు చేపలు, మాంసం తినడం కొనసాగిస్తారని గతంలో వ్యాఖ్యానించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా కలీఘాట్ ఆలయంలో సువేందు అధికారి చేపల భోగ్ స్వీకరించడాన్ని సమర్థించారు. ఇది బెంగాల్ సంప్రదాయాలకు అనుగుణంగానే ఉందని పేర్కొన్నారు.
Also Read
- Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
- Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
- Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
- BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలపై సువేందు ఏమన్నారు?
కలీఘాట్ పర్యటన సందర్భంగా ధీరేంద్ర శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై సువేందు అధికారిని ప్రశ్నించగా.. ఆయన తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. అయితే ఆ సూచనలను పాటించాలా వద్దా అనేది ప్రజల వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. తాను అనుసరించే హిందూ ఆచారాలను ఉదాహరణగా చూపుతూ వివిధ సందర్భాల్లో ఆహారపు విధానాలు మారుతాయని సువేందు వివరించారు. మహాష్టమి సందర్భంగా దుర్గాదేవిని పూజించే సమయంలో తాను సాత్విక ఆహారం తీసుకుంటానని, కార్తీక మాసంలోనూ సాత్విక ఆహారాన్నే తీసుకుంటానని చెప్పారు. అదే సమయంలో అమ్మవారికి సమర్పించే మేక మాంసం వంటి నాన్‌వెజ్ ప్రసాదాన్ని కూడా తాను స్వీకరిస్తానని తెలిపారు. ఒక సాధువు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, దాన్ని అంగీకరించాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమని సువేందు అధికారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
-
Telangana SSC Exams : తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ఇదే.. చివరి తేదీ ఎప్పుడంటే.?
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
-
Dhanush – Aishwaryaa: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!